ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూ ట్యూబ్‌ను షేక్ చేస్తున్న రంగస్థలం 'రంగమ్మ.. మంగమ్మా

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 15, 2018, 04:09 PM



మెగా పవర్‌స్టార్ రాం చరణ్ హీరోగా, అక్కినేని నాగార్జున కోడలు సమంత అక్కినేని హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం ఈనెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, తాజాగా విడుదల చేసిన 'రంగమ్మ.. మంగమ్మా..' అనే సాంగ్ యూ ట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ లిరికల్ ఆడియో సాంగ్‌ను 92,84,891 మంది నెటిజన్లు వీక్షించారు. టి సిరీస్ ద్వారా ఈ చిత్రంలోని ఆడియో పాటలను విడులు కాగా, 'రంగమ్మ.. మంగమ్మా' పాటను ఎంఎం.మనసి ఆలపించారు. ఆ పాట గేయరచయిత చంద్రబోస్ కాగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. 


ఈ ఆడియో పాటను 171 వేల మంది లైక్ చేయగా, 8.8 వేల మంది డిస్‌లైక్ చేశారు. మరోవైపు, ఈ చిత్రంలో చెర్రీ, సమంతలతో పాటు జగపతి బాబు, ఆది పినిశెట్టి ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా, సుకుమార్ దర్శకత్వం వహించారు.  








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com