ఈ ఫొటోలను చూస్తుంటే ‘ఆహా.. ఏమి ఈ కుక్క బతుకు’ అనిపించడం లేదూ! సినిమాల్లో కనిపించే అందాల చందమామలు ఈ కుక్క పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో ఈ ఫొటోలు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఈ కుక్కల ప్రేమ ముంబయిదాకా వెళ్లిపోయింది. ఎలా అంటే ముంబయిలో ఛార్మి, రష్మిక కలుసుకోవడమే కాదు తాము అల్లారు ముద్దుగా పెంచుకునే కుక్క పిల్లలతో బొమ్మలాట ఆడుకున్నారు కూడా.కాగా తాజాగా ఛార్మి మరియు రష్మిక ఇద్దరూ ఒకచోట ముంబైలో కలిశారు. ఈ సందర్భంగా రష్మిక తన కుక్క పిల్లలు కూడా వెంట తీసుకెళ్ళింది. అంతే కాకుండా ఇద్దరు తమ కుక్క పిల్లలను ఒక దాని ముందు ఒకటి ఉంచగా మొదట భయపడినా ఆ తర్వాత కలిసిపోయాయి. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఫ్రెండ్ అవుతున్నాయి. దాంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. క్యూట్ పప్పిస్ తో హాట్ బేబీస్ అని కామెంట్ చేస్తుండగా...మరికొందరు కుక్కపిల్లతో టాలీవుడ్ ముద్దుగుమ్మలు అని కామెంట్ పెడుతున్నారు.