ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య సంస్కారంపై సీనియర్ హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 16, 2018, 09:35 AM



తమ అభిమాన కథానాయకుల గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడితే అభిమానుల ఆనందమే వేరుగా ఉంటుంది. నందమూరి బాలకృష్ణ గురించి ఇలా చాలామందే పొగిడారు. నందమూరి అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తారు. తాజాగా సీనియర్ హీరోయిన్.. బాలయ్యతో ‘పెద్దన్నయ్య’ సినిమాలో నటించిన ఇంద్రజ ఆయన గురించి మంచి మాటలు చెప్పింది. ‘ఆలీతో జాలీగా’ కార్యక్రమంలో ఆమె బాలయ్య గురించి అసలేమందంటే..


‘‘పెద్దన్నయ్య కంటే ముందే నేను కథానాయికగా మంచి పేరే సంపాదించాను. అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. కానీ నేను అప్పటిదాకా మరీ పెద్ద హీరోలతో నటించింది లేదు. బాలయ్య స్థాయి హీరోతో చేయడం అదే మొదటిసారి. ఐతే ఆయన గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఆయనకు కోపం ఎక్కువని.. ఇంకా ఇలాంటివేవో చెప్పి భయపెట్టేశారు. దాంతో నాకు కంగారొచ్చేసింది.


తొలి రోజు షూటింగుకి వెళ్లినపుడు ఆయనకు ఎలా గుడ్ మార్నింగ్ చెప్పాలో రిహార్సల్స్ చేసుకుని వెళ్లాను. ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నాను. కానీ నేను గుడ్ మార్నింగ్ చెప్పగానే బాలయ్య గారు లేచి నిలబడి నన్ను సాదరంగా ఆహ్వానించారు. నా చెయ్యి అందుకుని పక్కన కూర్చోమని చెప్పి.. నేను కూర్చున్నాకే ఆయన కూర్చున్నారు. ఆయన నన్ను రిసీవ్  చేసుకున్న తీరుతో మొత్తం భయం పోయింది. అంతకుముందు కానీ.. ఆ తర్వాత కానీ నన్ను ఏ హీరో కూడా అలా ట్రీట్ చేయలేదు. అందుకే నా దృష్టిలో బాలయ్య వన్ అండ్ ఓన్లీ’’ అని ఇంద్రజ చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com