ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఉరిమే మనసే’.. అంటున్న రాక్ స్టార్ నాని

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 16, 2018, 01:36 PM



నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ఏప్రిల్ 12న విడుద‌ల చేయ‌నున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మిర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ త‌మీజా సంగీతం అందిస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే రెండు పాట‌ల‌ని విడుద‌ల చేసిన టీం తాజాగా మూడో పాట‌ని విడుద‌ల చేసింది. ‘ఉరిమే మనసే’.. అంటూ సాగే ఈ విరహగీతం సంగీత ప్రియుల‌ని అల‌రిస్తుంది. ఈ సాంగ్‌ను రఘు దీక్షిత్ ఆలపించగా.. శ్రీజో లిరిక్స్ అందించారు. ఈ పాట‌లో నాని రాక్‌స్టార్‌గా అర్జున్ పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. తొలి పాట‌గా విడుద‌లైన దారి చూడు దమ్మూ చూడు మామ.. అనే పాట‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ పాట పెంచ‌ల్ దాస్ పాడారు. ‘నా కనులే కనని ఆ కలనే కలిశా.. నీ వలనే బహుశా ఈ వరస.. ఐ వన ఫై.. వన ఫై..’ అనే ప్రేమ గీతంకి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కృష్ణార్జున యుద్ధం చిత్రంలో నాని డ్యూయ‌ల్ రోల్ పోషిస్తుండ‌గా, కృష్ణ పాత్ర‌లో ఊర‌మాస్‌గా క‌నిపించ‌నున్న నాని, అర్జున్ పాత్ర‌లో రాక్‌స్టార్‌గా అల‌రించ‌నున్నాడు. మ‌రి తాజాగా విడుద‌లైన ఉరిమే మ‌న‌సే.. సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com