నాగార్జున బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పూనమ్ బజ్వాకు ప్రత్యేక పరిచయం అవ్వాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా పలు భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు అందుకుంది.మొదటి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత వరుస సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం పూనమ్ సినిమాలకు కాస్త దూరంగా ఉండగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.ముంబై పాప పూనమ్ సింగ్ బాజ్వా మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టింది. మోడలింగ్ కోసమే హైడ్ వచ్చిన పూనమ్ కు అనుకోకుండా మొదటి సినిమా అవకాశం వచ్చింది. ఆ తరువాత తమిళ్, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించేసింది. అయితే చాలాకాలం నుంచి అమ్మడు సినిమాల్లో కనిపించటం లేదు. రెండేళ్ల క్రితం ‘కుప్పట్టు రాజా’ అనే తమిళ సినిమాలో బోల్డ్ గా కనిపించింది. ప్రస్తుతం ఓ మలయాళ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే 36 ఏళ్ళు దాటినా అమ్మడి అందాల ఆరబోత మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే పూనమ్ ఇంకా తనలో సత్తా ఉందని, ఎలాంటి పాత్రలైనా రెడీ అని సంకేతాలు ఇస్తుంది.