'రంగస్థలం'లో ఎంత సక్కగున్నావే పాటలో `గొల్లభామ' పదప్రయోగంపై గొల్లలు (యాదవులు) అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. `గొల్లభామ'ను `గోరువంక' భర్తీ చేశారు. `గొల్లభామ' అంటే గొల్ల కన్య అనే అర్ధం మాత్రం కాదని గీత రచయిత చంద్రబోస్ చెప్పినప్పటికీ సదరు కంమ్యూనిటీ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఈ మార్పు తప్పనిసరి అయ్యింది.
ఆ మధ్య `దువ్వాడ జగన్నాధం' చిత్రాల్లోని `అస్మైక యోగ.. తస్మైక భోగ' పాటలో కూడా ఇలాంటి అభ్యంతరాలు వ్వ్యక్తం కావడంతో.. అదులో కూడా మార్పులు చేసిన విషయం తెలిసిందే!!