బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌దేవ్‌గణ్, హీరోయిన్ టబు మంచి స్నేహితులు. వీరి కాంబినేషన్లో ఇప్పటికే `విజయ్‌పథ్`, `తక్షక్`, `దృశ్యం`, `గోల్మాల్ అగైన్` వంటి హిట్ సినిమాలు వచ్చాయి. సినిమాల్లోకి రాకముందే వీరిద్దరూ మంచి స్నేహితులు. కామన్‌ఫ్రెండ్స్ ద్వారా వీరి స్నేహం బలపడింది. అజయ్ నటించిన `రెయిడ్` సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అజయ్ తాజాగా టబు గురించి మాట్లాడాడు. `టబు నాకు మంచి స్నేహితురాలు. సినిమాల్లోకి రాకముందు నుంచే ఆమె నాకు పరిచయం. మా ఇద్దరం ఎప్పుడూ గొడవపడుతూ ఉంటాం. పెళ్లి చేసుకోమని ఆమెకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా ఆమె వినలేదు` అని అజయ్ అన్నాడు. అలాగే ఎక్కడికి వెళ్లినా కాజోల్‌తో సినిమా ఎప్పుడని అడుగుతున్నారని, కాజోల్‌తో సినిమా ఇప్పట్లో సాధ్యం కాదని, అద్భుతమైన కథ దొరికితేనే తమ కాంబినేషన్లో సినిమా ఉంటుందని అజయ్ చెప్పాడు.