నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఎమ్మెల్యే – మంచి లక్షణాలున్న అబ్బాయి. ఈ మూవీ ఈ నెల 23వ తేదిన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘మా ఊరిలో నన్ను అందరూ మంచి లక్షణాలున్న అబ్బాయి అని పిలుస్తారు.. దాన్నే షార్ట్ ఫామ్‌లో ఎమ్మెల్యే’ అంటారు. ‘నేనింకా రాజకీయం చేయడం మొదలు పెట్టేలేదు.. మొదలు పెడితే మీరు చేయడానికి ఏమీ ఉండదు అని కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్స్ అదిరేలా ఉన్నాయి. అలాగే హీరోయిన్ కాజల్ తో ‘పిల్లలకు ఆస్తులిస్తే అవి ఉంటేనే బతుకుతారు.. అదే చదువునిస్తే ఎలాగైనా బతుకుతారు అనే డైలాగ్ ట్రైలర్ లో పొందుపరిచారు..ఈ మూవీతో ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు..టి జి విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.. ఈ మూవీకి యు/ఎ సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. మీరూ తాజాగా విడుదలైన ట్రైలర్ ను చూడండి..