ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మగువలను ముగ్గులోకి దించడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య!

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 17, 2018, 05:14 PM




మగువలను ముగ్గులోకి దించడం అనే విద్య.. తాత రాజ్ కపూర్, తండ్రి రిషి కపూర్ ల నుంచి వంశ పారంపర్యంగా రణబీర్ కపూర్ కి సంక్రమించినట్లుంది. తనతో నటించే ప్రతి హీరోయిన్ నీ  ప్రేమ పేరు చెప్పి వశపరుచుకోవడం.. `సహజీవనం' చేయడం.. ఆపై ఏదో వంక పెట్టి వదిలించుకోవడం అతనికి పరిపాటి అయిపొయింది!

ప్రస్తుతం తనతో `బ్రహ్మాస్త్రం'లో నటిస్తున్న ఆలియా భట్ తో డేటింగ్ చేస్తున్న రణబీర్ ఇప్పటివరకు  ఎవరెవరితో ఎఫైర్స్ నడిపాడో సరదాగా  ఓ లుక్కేద్దాం!



సోనమ్ తో శ్రీకారం 

`సావరియా'తో హీరోగా పరిచయం కావడానికి ముందు రణబీర్ కపూర్ కొన్నాళ్లపాటు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. అప్పుడు కూడా పలువురితో ప్రేమాయణాలు నడిపాడని బాలీవుడ్ లో చెబుతారు. అయితే తనతో నటించిన హీరోయిన్ తో సీరియస్ గా సహజీవనం చేయడమన్నది.. `సావరియా'లో తనతోపాటు నటించిన సోనమ్ కపూర్ తో స్టార్ట్ అయ్యిందని చెబుతారు. అయితే.. అనిల్ కపూర్ కుమార్తె అయిన సోనమ్.. రిషి కపూర్ కుమారుడయిన రణబీర్ నడుమ సాగిన లవ్ ఎఫైర్ ఎక్కువకాలం సాగలేదు. ఇద్దరూ అప్పుడే సినిమాల్లోకి ప్రవేశించడం వల్ల.. ఎఫైర్ ని పబ్లిసిటీకి వాడుకోవాలి తప్ప పెళ్ళి వరకు తీసుకెళ్లకూడదని ఇరు వైపుల పెద్దలు నచ్చచెప్పారో ఏమో మనకు తెలియదు కానీ.. సినిమా ప్రమోషన్ కోసం `కొత్త జంటలా' ఎంచక్కా తిరిగిన ఈ జంట.. సినిమా విడుదైలైన కొన్నాళ్లకే విడిపోయారు.  ముఖ్య విషయం ఏమిటంటే.. తమ ఎఫైర్ గురించి ఇద్దరూ ఓపెన్ గా మాట్లాడకపోవడం. అలా అని `అదేమీ లేదు' అని ఖండించింది కూడా లేకపోవడం ఇక్కడ గమనార్హం!



గువ్వా గోరొంకల్లా రణబీర్-దీపిక

ఆ తర్వాత రణబీర్ రొమాంటిక్ లైఫ్ లోకి ఎంటర్ అయిన భామ దీపిక. వీరిద్దరూ ఓపెన్ గానే తిరిగేవారు. తమ రిలేషన్ గురించి కూడా ఓపెన్ గా మాట్లాడేవారు. వీరిద్దరూ కలిసి నటించిన `ఏ జవానీ హై దివాని' చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. అయినా సరే వీరిద్దరి రిలేషన్ కూడా ఎక్కువ రోజులు నడవలేదు. పైగా.. రణబీర్ వల్లే తమ బంధం తెగిపోయిందని దీపిక.. కాదు దీపిక వల్లే అది జరిగిందని రణబీర్ పరస్పరం ఆరోపించుకున్నారు. ఆ తర్వాత జరిగిందేదో జరిగిందని.. తామిద్దరం ఎప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటామని ఇద్దరూ విడివిడిగా ప్రకటించుకున్నారు!



దీపికతో రిలేషన్ లో ఉండగానే కత్రినాను లైన్ లో.. 

దీపికతో రణబీర్ రిలేషన్ ఎండ్ అవ్వడానికి కారణం కత్రినా అని చెబుతారు బాలీవుడ్ జనాలు. వీరిద్దరూ కలిసి `అజబ్ ప్రేమ్ కి గజబ్ కి కహాని'లో కలిసి నటించారు. సల్మాన్ ఖాన్ తో తెగతెంపులు చేసుకున్న కత్రినా.. రణబీర్ తో డీప్ లవ్ లో పడిపోయిందని చెబుతారు. అయితే ఇప్పుడు కత్రినా మళ్ళీ సల్మాన్ చెంతకు చేరిపోయింది.. అది వేరే విషయం. అప్పటికే ఇద్దరూ విడివిడిగా చాలా ఎఫైర్స్ నడిపి ఉన్నవారు కాబట్టి.. ఇద్దరూ అలసిపోయి ఉంటారు. `నడిపిన ఎఫైర్స్ చాల్లే.. ఇక ఎంచక్కా పెళ్లి చేసుకుందాం' అని డిసైడ్ అవుతారేమో అని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు!



నర్గీస్ నయా లవ్ స్టోరీ 

రణబీర్ కపూర్ కి అప్పటి అందాల నటి నర్గీస్ కి నడుమ ఘాటు ప్రేమాయణం జరిగిందని చెబుతారు. ఈ నేపథ్యంలో నర్గీస్ పేరు పెట్టుకున్న నర్గీస్ ఫక్రీతో రాజ్ కపూర్ మనవడైన రణబీర్ కపూర్ ఎఫైర్ కచ్చితంగా ఉంటుందని అందరూ అంచనా వేశారు. ఆ అంచనాలను రణబీర్ నిజం చేశాడు. `రాక్ స్టార్'లో తనతో కలిసి నటించిన నర్గీస్ తో చాన్నాళ్లు రాసలీలలాడాడు!



భట్ తో ఇప్పుడు హాట్ హాట్ గా..  

నర్గీస్ ని కూడా కొన్నాళ్లు వాడుకొని వదిలేసిన రణబీర్ ప్రస్తుతం ఆలియా భట్ తో జోరుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. మహేష్ భట్ రెండో భార్య లేదా మూడో భార్యకు పుట్టిన ఆలియా భట్ ప్రస్తుతం `బ్రహ్మాస్త్ర'లో రణబీర్ తో సినిమా చేస్తోంది. ఇటీవల తన 25వ పుట్టినరోజు జరుపుకున్న ఆలియా భట్ కి రణబీర్ కపూర్ మదర్ నీతూ కపూర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలపడం వార్తలకు కూడా ఎక్కింది!

మరి ఇప్పటికే చాంతాండంత ఉన్న తన ప్రియురాళ్ల జాబితాను రణబీర్ అలా పెంచుకుంటూ పోతాడా.. లేక భట్ తో అయినా వివాహ బంధంలోకి ప్రవేశించి గృహస్తుగా మారతాడా అన్నది వేచి చూడాలి. 

కొసమెరుపు: అన్నట్లు సినిమాల కంటే ఎఫైర్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్న రణబీర్ కపూర్ కెరీర్ ఈమధ్య మరీ అంత ఏం బాగాలేదు. `ఏ జవానీ హై దివాని' తర్వాత రణబీర్ కి సరైన హిట్టే లేదు. మరి ఇప్పటికైనా ఎఫైర్స్ మీద పెడుతున్న శ్రద్ధలో కనీసం సగమైనా కేరీర్ మీద పెడతాడో లేదో చూడాలి!! 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com