'రేస్ 3'లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లుక్ ఎలా ఉండబోతోంది? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు.. ఈ రోజు (సోమవారం) ఆ ముచ్చటా తీరిపోయింది. సల్మాన్ పోషిస్తున్న సికిందర్ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్.. చాలా స్టైలీష్‌గా ఉంది. ''సెల్ఫ్‌లెస్ ఓవర్ సెల్ఫీష్'' అంటూ తన పాత్ర తాలుకూ లక్షణాన్ని కూడా సల్మాన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. అనిల్ కపూర్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, బాబీ డియోల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు రెమో డిసౌజా దర్శకత్వం వహించారు. ఈద్ సందర్భంగా జూన్ 15న ఈ మూవీని విడుదల చేయనున్నారు.