తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ సినిమాలో తనదైన ముద్ర వేసింది అంజలి. ఆమె తొలి చిత్రం ‘కట్రదు తమిళ్’ విడుదలై ఇప్పటికి పదేళ్లు పూర్తయింది. ఆరంగేట్రలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అంజలి, వరుసగా నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకుంది. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో కుటుంబ సమస్యల కారణంగా కొంతకాలం తమిళ సినిమాకు దూరమైంది.కొన్నాళ్ల తరువాత కోలీవుడ్‌కి తిరిగొచ్చినా అవకాశాలు అంతంతమాత్రంగానే వచ్చాయి. అయితే ఈ ఏడాది అంజలి నటించిన నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. విజయ్ ఆంటోనీ జోడీగా నటించిన ‘కాళి’, రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పేరన్బు’, ‘కాన్బదు పొయ్’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే శశికుమార్‌కి జోడీగా నటిస్తున్న ‘నాడోడిగళ్2’ కూడా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో అంజలి నూతనోత్సాహంతో కనిపిస్తోంది.