ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద్వితీయారంభం కూడా అదిరేనా?

cinema |  IANS  | Published : Mon, Mar 19, 2018, 06:03 PM



90 వ దశకంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అందరు అగ్ర కథానాయకులతో జత కొట్టి, ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన రంభ.. తెలుగులోనే కాదు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలతోపాటు భోజపురి సినిమాలు సైతం చేసి హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. 


స్వతహా మంచి డాన్సర్ అయిన రంభ..  పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయడం కూడా తెలిసిందే. ఆరేడేళ్ల క్రితం పెళ్లి చేసుకొని కెనడాకు వెళ్ళిపోయిన రంభ వైవాహిక జీవితం అంత బాగున్నట్లు లేదు. 


కారణాలు ఏమైనా రంభ మళ్ళీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది. సప్తగిరి హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ ప్రధాన పాత్ర  పోషిస్తున్న రంభ యువ హీరోలకు తల్లి, అత్త పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపుతోందని సమాచారం. 


మరి `ద్వితీయారంభం' కూడా రంభకు అదురుతుందా లేక బెదురుతుందా అన్నది చూడాలి!! 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com