దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ – రానా కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్’ షూటింగ్ నేడు మొదలైంది. ఈ షూట్ లో పవన్ కళ్యాణ్ – రానా కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో అయితే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులుచేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్రలో కొన్ని మార్పులు చేశారట. అయితే, అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలో ఉన్న రెండు బలమైన పాత్రలలోని ఆ టెంపో ఎక్కడా తగ్గకుండా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. పవన్ పాత్రను పెంచినా.. రానా చేస్తున్న పాత్రకు కూడా తగిన ఇంపార్టెన్స్ ను ఉండేలా మేకర్స్ స్క్రిప్ట్ ను డైజిన్ చేశారట.