స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న మూవీ నాపేరు సూర్య – నా ఇల్లు ఇండియా.. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్.. మే నాలుగో తేదిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇక ఈ మూవీ స్వీడిష్ భామ ఎల్లి ఆరామ్ తో ఐటెం సాంగ్ ను చిత్రీకరించారు..ఈ విషయాన్ని స్వయంగా ఆ సుందరి చెప్పింది. ప్రస్తుతం క్వీన్ తెలుగు వెర్షన్ లో నటిస్తున్న ఎల్లి అప్పుడే మరో టాలీవుడ్ మూవీని అందుకోవడమే కాదు షూటింగ్ కూడా పూర్తి చేసేశానని చెప్పింది.. ఈ ఐటెం సాంగ్ స్లో సాంగ్ ఆట.. ఇదో ఫోక్ నంబర్ అని చెప్పింది. హైద్రాబాద్ లోని పరిసరాల్లో షూటింగ్ నిర్వహించారట. తనకు ఇదే తొలి తెలుగు సినిమా అని ఎల్లి చెప్పడం విశేషం. అల్లు అర్జున్ ని విపరీతంగా అభిమానిస్తానని చెప్పిన ఎల్లి ఈ ఐటెం సాంగ్ లో తాను ఒక్కర్తినే నర్తించానని పేర్కొంది..