ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్రెండ్ షిప్ డే కనుక గా 'ఆర్ఆర్ఆర్' తొలి పాట 'దోస్తీ' విడుద‌ల‌.. అల‌రిస్తోన్న 'దోస్తీ' పాట‌

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 01, 2021, 01:33 PM



రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి తొలిపాట విడుద‌లైంది. ఆ సినిమా అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా దీన్ని విడుద‌ల చేశారు. కీర‌వాణి అందించిన మ్యూజిక్ అదుర్స్ అనిపిస్తోంది. దోస్తీ అంటూ సాగుతోన్న ఈ పాట‌ను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారు. ఈ సినిమాలో హేమ‌చంద్ర ఈ పాట‌ పాడారు. ఈ పాట కోసం విడుద‌ల చేసిన ప్ర‌త్యేక వీడియోలో చివ‌రిగా ఈ సంగీత బృందంతో  ఎన్టీఆర్,  రామ్ చరణ్ క‌న‌ప‌డ్డారు. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.  ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యింద‌ని ఇటీవ‌లే సినిమా యూనిట్ వివ‌రించింది.


ఈ పాట కోసం విడుద‌ల చేసిన ప్ర‌త్యేక వీడియోలో చివ‌రిగా ఈ సంగీత బృందంతో  ఎన్టీఆర్,   రామ్ చరణ్ క‌న‌ప‌డ్డారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్‌గా న‌టిస్తోన్న‌ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తోన్న‌ రామ్ చరణ్ మ‌ధ్య దోస్తీ పాట ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమాలో వీరిద్ద‌రూ స్నేహితులుగా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ పాట‌ను విడుద‌ల చేశారు. బాహుబలి సినిమాల త‌ర్వాత‌ రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నారు.  ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com