సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మికా హీరోయిన్గా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ మరియు సుకుమార్ ల కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ఇది కావడం నిన్ననే ఫస్ట్ సింగిల్ పై కూడా సాలిడ్ అప్డేట్ ఇవ్వడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత స్థాయికి వెళ్తూ వస్తున్నాయి. మరి ఇప్పుడు రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మరో భారీ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రంపై ముందు నుంచి వినిపిస్తున్న రిలీజ్ సమయమే ఫిక్స్ అయ్యింది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని మేకర్స్ డిసెంబర్ నెలలో మొదటి పార్ట్ ని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో పుష్ప రాజ్ స్ట్రామ్ ఫిక్స్ అయ్యినట్టే అని చెప్పాలి.