ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెనాలి అమ్మాయి హాలీవుడ్ ఎక్స్పోజింగ్.. వైరల్ ఫోటోషూట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 03, 2021, 02:38 PM



టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కొద్ది మంది మాత్రమే కనిపిస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో ఎక్కువ శాతం మంది ముంబయి ముద్దుగుమ్మలు లేదంటే కేరళ తమిళనాడుకు చెందిన ముద్దుగుమ్మలు ఉన్నారు. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా ఎక్కువగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. టాలీవుడ్ లో చాలా మంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఇప్పటి వరకు ఎంట్రీ ఇచ్చినా వారిలో స్టార్ డమ్ దక్కించుకున్న వారు మాత్రం లేరు. కాని ఇతర భాషల్లో మన ముద్దుగుమ్మలు సక్సెస్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. తెలుగు అమ్మాయిలు ఒకప్పుడు స్కిన్ షో విషయంలో ఆసక్తి చూపించే వారు కాదు. కాని ఇప్పుడు మాత్రం తెలుగు అమ్మాయిలు స్కిన్ షో విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.


ఇషా నుండి మొదలుకుని పలువురు తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా చిన్న సినిమాల్లో నటిస్తూ అందాల ప్రదర్శణ విషయంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలను కూడా బీట్ చేస్తున్నారు. చాలా ఉత్తరాది ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో టాప్ స్టార్ గా దూసుకు పోతున్నారు. వారిని పోటీ పడేలా తెలుగు అమ్మాయిల అందాల ప్రదర్శణ ఉంటుంది. తాజాగా తెనాలి అమ్మాయి 'శోభిత దూళిపాళ్ల ' షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


హిందీతో పాటు పలు భాషల్లో సినిమాలు చేసిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోలను నెటిజన్స్ చూస్తూ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. హాలీవుడ్ హీరోయిన్స్ మాదిరిగా ఈ స్టిల్స్ లో ఆమె ఔట్ ఫిట్ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె మేజర్ సినిమాతో పాటు పలు సినిమాల్లో కనిపిస్తుంది. వచ్చే ఏడాదిలో ఈమె నటించిన నటిస్తున్న సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు లో కూడా ఈమె మెల్ల మెల్లగా స్టార్ డమ్ దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అందంతో పాటు నటిగా మంచి ప్రతిభ కనబర్చగల ఈమెకు మంచి ఫ్యూచర్ ఉందని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com