ఏ హీరో అయినా .. హీరోయిన్ అయినా .. ఆ మాటకొస్తే ఏ నటీనటులైనా తాము చేసే సినిమా తమకి మంచి పేరు తీసుకురావాలనే భావిస్తారు. ఆ సినిమా ద్వారా తమకి మరిన్ని అవకాశాలు రావాలనే ఆశిస్తారు. అయితే ఒక్కోసారి తాము ఈ సినిమాను ఓకే చేసి పొరపాటు చేశావేమోననే బాధ వాళ్లకి కలుగుతూ ఉంటుంది. తాను చేసిన 15 సినిమాల్లో ఒక సినిమా విషయంలో ఇలాగే అనిపించిందని తాజా ఇంటర్వ్యూలో రాశి ఖన్నా చెప్పింది. కథ వింటున్నప్పటడు బాగానే అనిపించిందనీ .. తెరపై చూసుకున్నప్పుడు మాత్రం చాలా నిరాశ కలిగిందని అంది. ఈ సినిమాను చేసి వుండాల్సింది కాదనిపించిందని చెప్పింది. అంతగా అసంతృప్తిని కలిగించిన ఆ సినిమా పేరును మాత్రం చెప్పకుండగా సస్పెన్స్ లో పెట్టేసింది. 'ఆ సినిమా ఏమిటనేది మీరే గెస్ చేయండి' అన్నట్టుగా అభిమానుల ఊహకే వదిలేసింది.