బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం రేస్ 3. అబుదాబిలో చిత్రానికి సంబంధించి హై ఇంటెన్సిటీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు దర్శకులు. జాక్వెలైన్ ఫెర్నాండెజ్ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, షూటింగ్ ప్రమాదంలో ఈ అమ్మడు గాయపడినట్టు తెలుస్తుంది. స్క్వాష్ గేమ్ ఆడుతున్న టైంలో బాల్ జాక్వెలైన్ ఎడమ కంటి పై భాగంలో తగలింది. వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. చికిత్స తర్వాత ఆమె కొన్నివేశాలలో నటించినట్టు సమాచారం. గత వారం జాక్వెలైన్ పలు యాక్షన్ సీన్స్ లో నటించింది. స్టైలిష్‌గా ఉండనున్న ఈ సీన్స్ లో కిక్‌లతో పాటు పంచ్‌లు కూడా ఉంటాయని తెలుస్తుంది. యాక్షన్ సీన్స్ కోసం జాక్వెలైన్ ప్రతి రోజు రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేసింది. రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందుతున్నరేస్ 3 చిత్రంలో అనీల్ కపూర్, బాబీ డియోల్, సకీబ్ సలీమ్, డైసీ షా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈద్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.