టన్నుల కొద్దీ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ' అంటూ టాలీవుడ్ కింగ్ నాగార్జున సెప్టెంబర్ 5న బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ప్రేక్షకులకు తెలియని కొత్త ముఖాలు చాలానే ఉన్నాయి. అయితే రోజులు గడిచే కొద్దీ వారు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలో ఆడియన్స్ కూడా తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు గుద్దుతూ వారిని ఎలిమినేషన్ నుంచి రక్షిస్తున్నారు. ఈ గ్రాండ్ రియాలిటీ షో ఇప్పుడు మూడు వారాలు కంప్లీట్ చేసుకునే దిశగా వెళ్తుంది. అయితే మరి ప్రతి వారాంతంలో కూడా ఒక ఎలిమినేషన్ ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ వారపు నామినేషన్స్ లో మానస్, శ్రీరామ చంద్ర అలాగే లహరి, ప్రియాంక మరియు ప్రియా లు ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నదానికి సమాధానం వినిపిస్తుంది. మరి లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ షో నుంచి రేపు లహరి వెళ్లిపోనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే లహరి విషయంలో కాస్త నెగిటివిటీ ఉంటూనే ఉంది సో ఇప్పుడు లహరి టైం వచ్చినట్టుగా టాక్. మరి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళేది ఎవరో తెలియాలి అంటే రాత్రి వరకు ఆగాల్సిందే.