‘బిచ్చగాడు’ సినిమా దర్శకుడు శశి దర్శకత్వంలో హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలోవచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్ బామ్మర్ది’. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అక్టోబర్ 1వ తేది నుంచి ఒటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఆహాలోకి స్ట్రీమింగ్‌లోకి రాబోతుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, సిద్ధార్థ్‌కి బామర్ధిగా జీవీ ప్రకాశ్ కుమార్ నటించారు. ఈ సినిమాకి సిద్ధూ కుమార్ సంగీతం అందించగా, ప్రసన్న యస్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.