ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుదైన రికార్డు లో పుష్ప 'శ్రీవల్లి' సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 18, 2021, 06:50 PM



అల్లు అర్జున్ - రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా షూటింగు జరుపుకుంటోంది. దాదాపుగా షూటింగు చివరిదశకు చేరుకుంది. ఈ నెలాఖరుతో ఈ సినిమా షూటింగు పాటు పూర్తవుతుందని అంటున్నారు. వచ్చేనెలలో మిగతా పనులు పూర్తిచేసి, డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు.


ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక్కో లిరికల్ వీడియో సాంగును వదులుతున్నారు. ముందుగా రిలీజ్ చేసిన 'దాక్కో దాక్కో మేక' లిరికల్ వీడియో రికార్డుస్థాయిలో దూసుకుపోతోంది. రీసెంట్ గా వదిలిన 'శ్రీవల్లీ' పాట కూడా ఒక రేంజ్ లో జనంలోకి వెళ్లింది. ఈ పాటను కూడా ఈ సినిమాను విడుదల చేయనున్న 5 భాషల్లో వదిలారు.


5 భాషల్లో కలుపుకుని ఇంతవరకూ ఈ పాట 20 ప్లస్ మిలియన్ వ్యూస్ ను రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ వేగంతో వ్యూస్ తెచ్చుకున్న పాటల జాబితాలో ఇది కూడా చేరనుందని చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com