ఆకాశ్ పూరీ, కేతిక శర్మ జంటగా నటిస్తోన్న ‘రొమాంటిక్’ సినిమా ట్రైలర్ ను మంగళవారం సాయంత్రం 4 గంటలకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేయనున్నాడు. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించాడు. మకరంద్ దేశ్పాండే, ఉత్తేజ్, సునయన కీలక పాత్రలు పోషిస్తున్నారు.