ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రోజు రానున్న భీమ్లా నాయక్ టీజర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 28, 2021, 10:58 AM



పవన్ కల్యాణ్ ,రానా హీరోలుగా నటించిన  సినిమా  'భీమ్లా నాయక్' . పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ నటిస్తుండగా .. రానా జోడీగా సంయుక్త మీనన్ అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. వచ్చేనెలతో షూటింగు పార్టు కంప్లీట్ అవుతుందని అంటున్నారు.సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి వచ్చిన పవన్ .. రానా పాత్ర తాలూకు వీడియోస్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల పవన్ - నిత్యామీనన్ కాంబినేషన్లోని పాటను వదిలిన విషయం తెలిసిందే. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.మాస్ ఎలిమెంట్స్ తో కూడిన టీజర్ ను రెడీ చేస్తున్నారని అంటున్నారు. ఈ టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12వ  తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com