మాములుగా అగ్ర హీరో సినిమా అనుకున్నారంటే ఆ కాంబినేషన్ బట్టి బయ్యర్స్ ఈ మూవీ ని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు..లేదా సినిమా షూటింగ్ టైంలోనే బేరాలు పూర్తి చేస్తారు..కానీ తాజాగా పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ లా చిత్రాలకు కొనేవారు లేరట..ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. అదేంటి వారి చిత్రాలు కొనేవారు లేకపోవడమేంటి అనే సందేహం కలుగుతుందా..మీకే కాదు మాకు ఆ సందేహం వచ్చింది..ఎందుకలా అని ఆరాదిస్తే వారు ఆయా చిత్ర నిర్మాతలు చెప్పే రేటు చూసి బయ్యర్స్ ముందుకు రావడం లేదట.మురుగదాస్ – మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న బైలింగ్యువల్ మూవీ స్పైడర్… మాములుగా మహేష్ సినిమాలకు ఓవర్సీస్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ స్పైడర్ విషయంలో మాత్రం రివర్స్ అయ్యిందట. ఈ చిత్రానికి ఏకంగా 22-25 కోట్ల మేర డిమాండ్ చేశారట నిర్మాతలు. దాంతో బయ్యర్స్ బయటపడి పోయి మాకు ఆ సినిమానే వద్దు అన్నట్లు పారిపోయారట..ఇంతకు మళ్లీ రాకపోయేసరికి..ఇప్పుడు 16 కోట్లకు డీల్ పూర్తి చేద్దామని నిర్మాతలు భావిస్తున్నా కొనేవాళ్లు కనిపించడం లేదు.
ఇక ఎన్టీఆర్ లవకుశ మూవీ సైతం ముందు నిర్మాతలు రూ. 18 కోట్లు చెప్పారట..అంత మీము పెట్టలేమని వెనక్కు వెళ్లిపోయారట..ఇప్పుడు రూ. 14 కోట్లు అన్నగాని ముందుకు రావడం లేదట..ఇక త్రివిక్రమ్ – పవన్ మూవీ సైతం రూ. 20 కోట్లు చెప్పారట..దాంతో ఖంగ్ తిన్న బయ్యర్లు , పెద్ద ఇంట్రస్ట్ చూపించడం లేదని అంటున్నారు..మొత్తం మీద మన నిర్మాతలు ఓవర్సీస్ బయ్యర్లకు చుక్కలు చూపిస్తున్నారు.