ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటమ్ సాంగ్ చేస్తున్న కైరా అద్వాణీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 19, 2018, 03:12 PM



రేపు విడుదలవుతున్న ‘భరత్ అనే నేను’ సినిమాతో బాలీవుడ్ భామ కైరా అద్వాణీ తెలుగు తెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ లో మూడు సినిమాలు చేసిన కైరా మీద బీ టౌన్ నిర్మాత దర్శకుడు కరణ్ కన్ను పడిందట. తన గ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతున్న ‘కలంక్’ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో వరుణ్ తో కలిసి చిందేయనుందట కైరా అద్వాణీ.


1940 నాటి పౌరాణిక డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్ దావణ్- అలియా భట్- సోనాక్షి సిన్హా- సంజయ్ దత్- మాధురి దీక్షిత్ వంటి తారాగణం నటించబోతున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో వరుణ్ తో కలిసి డ్యాన్స్ చేసేందుకు సిద్ధమవుతోంది కైరా అద్వాణీ. ఇప్పటికీ వీరిద్దరూ కలిసి ‘భరత్ అనే నేను’ సినిమాలోని ‘ఓ వసుమతి’ పాటకి కలిసి చిందేస్తూ కనిపించారు. ఈ వీడియోని కైరా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. ఇది స్పెషల్ సాంగ్ రిహార్సల్ లో భాగమేనట. ‘కరణ్ సార్ సినిమాలో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను...’ అంటూ ఆనందంతో గంతులేస్తోంది కైరా అద్వాణీ.


అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహిస్తున్న ‘కలంక్’ వచ్చే ఏడాది ఇదే రోజున అంటే ఏప్రిల్ 19న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు కరణ్ జోహార్. ఇదిలా ఉంటే ‘భరత్ అనే నేను’  సినిమా తర్వాత ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన నటించేందుకు సిద్ధమవుతోంది కైరా అద్వాణీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com