ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టైమ్ 100 జాబితాలో మన హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 20, 2018, 10:34 AM



బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే.. ఇప్పుడు మరో అరుదైన గుర్తింపును అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసి రూపొందించిన టైమ్ 100 ఇన్ ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో చోటు దక్కించుదుకుంది దీపిక. ఈ లిస్ట్ లో ఉన్న ఒకే ఒక్క భారతీయ నటీమణి దీపిక కావడం విశేషం.ఇతరులపై ప్రభావం చూపడంలో దీపిక చాలా అగ్రెసివ్ అంటున్నాడు ఆమెతో కలిసి హాలీవుడ్ ఫిలిం ట్రిపుల్ ఎక్స్ క్సాండర్ కేజ్ లో నటించిన సహనటుడు విన్ డీజిల్. ఈ చిత్రానికి క్యాస్టింగ్ ఎంపిక చేసినపుడు.. ఎంపిక అయిన తొలి ఆర్టిస్ట్ ఆమే అని చెప్పగా.. మొదటిసారి ఆమెను కలిసినపుడే తనపై ప్రభావం చూపిందని అన్నాడు. తను ఈ చిత్రంలో నటించడానికి సిద్ధమే అయినా.. తను నటించాలంటే మాత్రం మీరంతా ఇండియా రావాలనే కండిషన్ పెట్టిందని.. దానికి తామంతా అంగీకరించామని అన్నాడు విన్ డీజిల్.


దీపిక చుట్టుపక్కల ఉంటేనే ఓ శక్తివంతమైన ప్రాంతంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుందంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు విన్ డీజిల్. తాము శక్తివంతులుగా ఉండడమే కాదు.. దానిని ఇతరులపై సానుకూలంగా ప్రభావం చూపేంతటి చరిష్మాను అతి తక్కువ మంది మాత్రమే కలిగి ఉంటారు. టైమ్ 100 జాబితాలో చోటు సంపాదించి అరుదైన ఘనత సాధించిన దీపిక.. పద్మావత్ చిత్రంతో తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. ఫిమేల్ లీడ్ గా రూపొందిన చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించడం.. పద్మావత్ తోనే జరిగింది.. దీపికకు మాత్రమే చెల్లింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com