రెండు సంవత్సరాల క్రితం టాలీవుడ్లో టాప్ హీరోయిన్ స్టేటస్‌ను అనుభవించిన ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు దాదాపుగా తెలుగు ఇండస్ట్రీకే దూరం అయింది. అయినా తెలుగు ఇండస్ట్రీపై మాత్రం తన ప్రేమను చూపుతూనే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ రిపోర్టర్.. మీరు ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నను. అవును తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో ప్రేమలో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఇక ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. దానికి రకుల్ కచ్చితంగా అంటూ సమాధానాన్ని ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రకుల్ తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. కాగా.. నాగ చైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’లో స్పెషల్ సాంగ్‌లో రకుల్ నటిస్తున్నట్లు వార్తలు రాగా, వాటిని ఆమె ఖండించిన విషయం తెలిసిందే.