నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఓయ్’ ఫేం షామిలీ కథానాయిక. స్వజిత్ మూవీస్ పతాకంపై రాజేశ్ నిర్మిస్తున్నారు. కల్యాణ రమణ సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, సుమన్, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు.‘కజిన్స్ ఇంటికి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినా ఎక్కువ సేపు ఉండలేం నాన్న.. తిరిగి వచ్చేయాలి అనిపిస్తుంది.. కానీ ఒక్క అమ్మమ్మ ఇంటికి వెళ్తే మాత్రం తిరిగి రావాలి అనిపించదు’ అంటూ ఈ టీజర్ ప్రారంభమైంది. పల్లెటూరులో పెద్ద కుటుంబం, వారి మధ్య ఆప్యాయతల్ని ఇందులో చూపించారు. అమ్మమ్మకు నచ్చితే ఏమైనా చేస్తాను రా.. దాంట్లో వచ్చే ఆనందమే వేరు’ అనే నాగశౌర్య డైలాగ్‌తో టీజర్ ముగిసింది.