ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు ఇష్టమైన వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే: ప్రియాప్రకాశ్‌

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 23, 2018, 03:59 PM



కేరళ: కంటి చూపుతోనే ప్రేక్షకులను ఫిదా చేసిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్‌’లోని ‘మాణిక్య మలరయ’ అనే పాటలో ప్రియ పలికించిన హావభావాలను అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. అయితే ఈరోజు ప్రియకు ఎంతో ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజట. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా? మరెవరో కాదు..‘ఒరు అదార్‌ లవ్‌’ కథానాయకుడు రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌.


ఈరోజు అతని పుట్టినరోజంటూ ప్రియ ట్వీట్‌ చేశారు. ‘నాకు ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది? ఎందుకంటే మీకందరికీ తెలుసు.’ అని ట్వీటారు. ఒమర్‌ లులు ‘ఒరు అదార్‌ లవ్‌’కు దర్శకత్వం వహించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ చిత్రం మార్చి 3న విడుదల అయ్యుండేది. కానీ సినిమాలో ముస్లింల మనోభావాలను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ కొందరు వ్యక్తులు ప్రియపై, దర్శకుడిపై కేసు వేశారు.


 


ఆ తర్వాత ప్రియ తనపై ఎలాంటి క్రిమినల్‌ చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసింది. కోర్టు తీర్పు ప్రియకు అనుకూలంగా రావడంతో సినిమాను జూన్‌కు వాయిదా వేశారు. మలయాళంలో ప్రియ నటించిన తొలి సినిమా ఇది. సినిమా విడుదలకు ముందే ఆమకు విపరీతమైన స్టార్‌డం వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com