నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'అఖండ'. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయినిగా నటించింది,ఈ సినిమాలో విల్లన్ గా శ్రీకాంత్ నటించాడు.ఈ సినిమాకి ఎస్.థమన్ సంగీతం అందించాడు.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ చిత్రం అఖండ.డిసెంబర్ 2న సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. బాలకృష్ణ కెరీర్లో తొలిసారిగా ఈ సినిమా 130 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్‌స్టార్‌లో జనవరి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది.