ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటీ లో 'అఖండ' మరో సెన్సేషనల్ రికార్డ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 08:29 PM



కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమా ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కేవలం కాంబినేషన్ మీద ఉన్న క్రేజ్‌తో డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది ‘అఖండ’.బాక్సాఫీస్ బరిలో అసలు సిసలు మాస్ జాతర అంటే ఏంటో చూపించింది. ‘అఖండ’ గా బాలయ్య నట విశ్వరూపానికి ప్రేక్షకాభిమానులు నీరాజనాలు పట్టారు. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది ‘అఖండ’. విజయవంతంగా 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని (ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే) జనవరి 21 సాయంత్రం 6 గంటల నుండి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇక ఓటీటీలోనూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు బాలయ్య. విడుదలైన 24 గంటల్లో ఓటీటీలో 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి.. ఓటీటీ హిస్టరీలో ‘ఆల్ టైమ్ హయ్యస్ట్ వ్యూవ్డ్’ ఫిలింగా సెన్సేషనల్ రికార్డ్ నమోదు చేసింది ‘అఖండ’. ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో చూసినా బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి టేకింగ్, థమన్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ గురించిన పోస్టులే కనిపిస్తున్నాయి. త్వరలో ఇతర భాషల్లో డబ్ చేసి అప్‌లోడ్ చెయ్యబోతున్నారు మేకర్స్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com