ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మహానటి'

cinema |  Suryaa Desk  | Published : Fri, May 04, 2018, 03:50 PM



నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' పేరుతో సావిత్రి జీవిత కథ రూపొందింది. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'క్లీన్ యు' సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్స్ కి .. టీజర్ కి .. ట్రైలర్ కి .. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించడం ఖాయమనే నమ్మకంతో దర్శకనిర్మాతలు వున్నారు. సమంత .. షాలినీ పాండే .. దుల్కర్ సల్మాన్ .. విజయ్ దేవరకొండ వంటి యువ నటీనటులు, మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ వంటి సీనియర్ నటులు నటించడం ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి పెరగడానికి కారణమవుతోంది. ఈ సినిమా కీర్తి సురేశ్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com