ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భ‌ర‌త్ అనే నేను' డిలీటెడ్ సీన్స్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, May 05, 2018, 10:56 AM



సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు-స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం భ‌ర‌త్ అనే నేను. శ్రీమంతుడు చిత్రం త‌ర్వాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన భ‌రత్ అనే నేను బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఫిక్ష‌న్ నేప‌థ్యంలో సోష‌ల్ మెసేజ్‌తో కొరటాల తెర‌కెక్కించిన ఈ చిత్రం అందరిని అల‌రించింది. యంగ్ అండ్ డైన‌మిక్ సీఎంగా మ‌హేష్ ఆక‌ట్టుకున్నాడు. కైరా అద్వానీ ప‌ర్‌ఫార్మెన్స్‌, దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం, రామ జోగ‌య్య శాస్త్రి లిరిక్స్ సినిమా విజ‌యంలో భాగం అయ్యాయి. ఈ చిత్ర ర‌న్ టైం మూడు గంట‌లు దాట‌డంతో కొన్ని స‌న్నివేశాల‌ని డిలీట్ చేసి మూవీని రిలీజ్ చేశారు. మూవీ మంచి విజ‌యం సాధించ‌డంతో నిర్మాతలు డిలీటెడ్ సీన్స్‌కి సంబంధించిన వీడియోల‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సీన్స్ కూడా సినీ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాయి. వాటిపై మీరు ఓ లుక్కేయండి.














SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com