మెంటల్ మదిలో సినిమాలో చక్కని హోమ్లీ పాత్రలో నటించింది నివేతా పేతు రాజ్. ఈ నటి తను హాట్ ఫోటో షూట్ చేయించుకుంది అంటూ బికినీలో ఉన్న కొన్ని ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ కావడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నటిగా అంత టాలెంట్ పెట్టుకుని అవకాశాలు లేని దానిలా మరీ ఇంత మొహమాటం లేకుండా గుడ్డ పీలికలు వేసుకుని ఫోటోలు తీసుకుంటావా అని అభిమానులు మాటలతో దాడి చేసినంత పని చేసారు. కాని ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ ఫోటోలలో ఉన్నది నివేతా కాదు. అచ్చం తన పోలికల్లో కనిపించే వర్షిణి పాకల్. ప్రముఖ మోడల్ ఫోటోగ్రాఫర్ ప్రసూన్ ప్రశాంత్ దీన్ని తీసాడు. అందరు వాటిలో నివేతా అనే పొరపడ్డారు. నివేతాకు మాత్రం ఇలాంటి పోలిక నెగటివ్ గా ఇబ్బంది పెట్టింది.