ట్రెండింగ్
Epaper    English    தமிழ்

7 దేశాల్లో హన్సిక సినిమా

cinema |  Suryaa Desk  | Published : Mon, May 07, 2018, 04:38 PM



దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరైన హన్సిక ప్రస్తుతం హీరోయిన్ సెంట్రిక్ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు జమీల్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను ఇండియా, యూరప్, జార్జియా, మారిషస్ వంటి ఏడు దేశాల్లో చిత్రీకరించనున్నామని జమీల్ తెలిపారు.


అలాగే హన్సిక ఇప్పటివరకు గ్లామర్, సెంటిమెంట్, కామెడీ వంటి వివిధ రకాలైన ఎమోషన్లని వేరు వేరు సినిమాల్లో చూపించారని.. కానీ వాటన్నిటినీ కలిపి ఈ ఒక్క సినిమాలోనే చేస్తారని అన్నారు. జూన్ నెలలో మొదలుకానున్న ఈ చిత్రాన్ని ‘గరుడవేగ’ చిత్రాన్ని నిర్మించిన కోటేశ్వరరాజు నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com