బాలీవుడ్ నటీమణులు ప్రియాంక చోప్రా, దీపిక పదుకొణె మరోసారి అంతర్జాతీయ వేడుకలో తళుక్కున మెరిశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ‘మెట్ గాలా’ ఈవెంట్లో వీరిద్దరూ సందడి చేశారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక ఎప్పటిలాగే విభిన్న వస్త్రాలంకరణలో అందరి చూపును తనవైపునకు తిప్పుకున్నారు. దీపిక ఎరుపు రంగు గౌనులో అందంగా కన్పించారు. ఇతర హాలీవుడ్ నటీనటులు విభిన్నమైన దుస్తుల్లో మెరిశారు.
ప్రియాంక అమెరికన్ టెలివిజన్ సిరీస్ ‘క్వాంటికో’తో హాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇందులో అలెక్స్ అనే ఎఫ్‌బీఐ ఏజెంట్‌గా నటించిన ప్రియాంక తన నటనతో హాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత ఆమెకు అక్కడ వరుసగా సినీ అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ప్రియాంక ‘ఎ కిడ్ లైక్ జేక్’, ‘ఇజింట్ ఇట్ రొమాంటిక్’ చిత్రాలతో పాటు ‘క్వాంటికో 3’తో బిజీగా ఉన్నారు.
మరోపక్క దీపిక ‘ట్రిపులెక్స్: ది రిటర్న్ ఆఫ్ ది జాండర్ కేజ్’ చిత్రంతో హాలీవుడ్‌కు పరిచయమయ్యారు. హాలీవుడ్లో తొలి చిత్రంతోనే దీపిక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆమె మరో హాలీవుడ్ సినిమాకు ఒప్పుకోలేదు. త్వరలో తెరకెక్కించబోయే ‘ట్రిపులెక్స్ 4’ చిత్రంలోనూ దీపిక కథానాయికగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలా దీపిక, ప్రియాంక బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాకు సంబంధించిన ఏ అంతర్జాతీయ ఈవెంట్లు జరిగినా వీరిద్దరనీ ఆహ్వానిస్తుంటారు.