తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ క్యాథరిన్ థెరిస్సా. ఇటీవల “నేనే రాజు నేనే మంత్రి మూవీలో నటించి హిట్ కొట్టింది… త్వరలో మైతీ మూవీ మేకర్స్ హీరో రవితేజతో రూపొందించనున్న మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది. తాజాగా ఓ రెండువారాల పాటు న్యూయార్క్ లో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయడం కోసం ఆమె అమెరికా వెళ్లింది.. అక్కడ మిస్ వీ అనే వరల్డ్ పాపులర్ డ్యాన్సర్ దగ్గర క్రాష్ కోర్స్ జాయిన్ అయ్యింది. ఆల్రెడీ మంచి డ్యాన్సర్ అయిన క్యాథరిన్ తన కొత్త గురువు మిస్.వీ దగ్గర పాపింగ్ అండ్ లాకింగ్ స్టైల్ లో ట్రయినింగ్ తీసుకుంటున్నది.. ఈ సరికొత్త డ్యాన్స్ మూవ్స్ కేవలం తన డ్యాన్సింగ్ స్కిల్స్ పెంపొందించుకోవడం కోసమేనని అంటున్నది.