ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కల్కి' గా రాజశేఖర్!

cinema |  Suryaa Desk  | Published : Wed, May 09, 2018, 11:27 AM



'గరుడ వేగ' సినిమాతో రాజశేఖర్ అనూహ్యమైన విజయాన్ని అందుకున్నాడు. గరుడ వేగ   స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో మంచి కథల కోసం రాజశేఖర్ వెయిట్ చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి 'అ!' దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక కథను వినిపించాడు.


ఇంతవరకూ తాను ఈ తరహా సినిమా చేయకపోవడం వలన.కథలోని వైవిధ్యం కారణంగా ..  వెంటనే రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 

ఈ సినిమాకి 'కల్కి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలోనే ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి .. సెట్స్ పైకి వెళ్లడానికి ప్రశాంత్ వర్మ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాతో పాటు ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో ను రాజశేఖర్ ఒక సినిమా చేయనున్నాడు. తమిళంలో ధనుష్ దర్శకత్వంలో హిట్ కొట్టిన 'పవర్ పాండి'కి ఇది రీమేక్.     





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com