ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగు దశలో సుబ్రహ్మణ్య పురం

cinema |  Suryaa Desk  | Published : Wed, May 09, 2018, 12:05 PM



ఈ మధ్య కాలంలో అతీంద్రియ శక్తుల నేపథ్యంతో కూడిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కరెక్టుగా కంటెంట్ ను ప్రెజెంట్ చేయగలిగితే ఆ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తోన్న సుమంత్, ఈ సారి అతీంద్రియ శక్తులకు సంబంధించిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కథకి తగినట్టుగా ఈ సినిమాకి 'సుబ్రహ్మణ్యపురం' అనే టైటిల్ ను ఖరారు చేశారు.  పోస్టర్ చూస్తుంటే ఇది సుబ్రహ్మణ్యస్వామి మహిమాన్విత ఆలయం చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ నెల 12వ తేదీ నాటికి ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ఈ సినిమాలో సుమంత్ సరసన ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా సుమంత్ కి తప్పకుండా సక్సెస్ ను అందించే అవకాశాలు వున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com