ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరణ్ తో కలిసి కేథరిన్ దుమ్మురేపేస్తుందట

cinema |  Suryaa Desk  | Published : Thu, May 10, 2018, 11:52 AM



తెలుగు తెరపై అందాల కథానాయికగా కేథరిన్ మంచి మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా ఆకర్షణీయమైన కళ్లతో యూత్ హృదయాలను దోచేసింది. 'సరైనోడు' సినిమాలో ఎమ్మెల్యే గా కనిపించి ఆకట్టుకున్న ఈ సుందరికి, తన తరువాత సినిమా అయిన 'జయ జానకి నాయక'లోను బోయపాటి ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ కి మాస ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.


దాంతో ఇప్పుడు చరణ్ సినిమా కోసం కూడా ఆమెనే బోయపాటి ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. కైరా అద్వాని కథానాయికగా చేస్తోన్న ఈ సినిమాలో, చరణ్ తో కలిసి కేథరిన్ ఒక ఐటమ్ చేయనున్నట్టు తెలుస్తోంది. బ్యాంకాక్ షెడ్యూల్ తరువాత ఈ ఐటమ్ సాంగ్ ను చిత్రీకరిస్తారట. గతంలో చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' షూటింగు సమయంలో కొన్ని కారణాల వలన కేథరిన్ తప్పుకుంది. దాంతో ఇక ఆమెకి మెగా హీరోల సరసన ఛాన్స్ దొరకడం కష్టమేనని అనుకున్నారు. అలాంటి అనుమానాలకు బోయపాటి తెరదించేశాడనే చెప్పాలి.  


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com