ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా హీరోయిన్ అందాలు ఎవర్ గ్రీన్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 10, 2018, 02:04 PM



చందమామ అంటూ టాలీవుడ్ ముద్దుగా పిలుచుకునే భామ కాజల్ అగర్వాల్. ఇప్పటికి ఈ సుందరి తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించి దశాబ్దం పైగా కాలం గడిచిపోయింది. శరవేగంగా స్టార్ హీరోలను అందరినీ చుట్టేసిన రికార్డు కూడా ఈమె ఖాతాలో పడిపోయింది. స్టార్ హీరోయిన్ తో పాటు సీనియర్ అనే ట్యాగ్ కూడా పడిపోయినా.. ఇప్పటికీ యంగ్ హీరోలతో కూడా సినిమాలను ఎప్పుకుంటూ షాకులు ఇస్తూనే ఉంది. 


ఎప్పటికప్పుడు తన అందాలకు మెరుగులు దిద్దుకోవడమే కాదు.. క్రేజ్ కంటిన్యూ చేయడం కూడా కాజల్ కు బాగా అలవాటయిపోయింది. రీసెంట్ గా ఓ కమర్షియల్ ఈవెంట్ కు హాజరైన ఈ చందమామ.. బోలెడన్ని సొగసులు చూపించేసింది. అసలే ఫ్యాషన్ కు సంబంధించిన కార్యక్రమం కావడంతో.. తన మేని మెరుపుల విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు ఈ బ్యూటీ. డిజైనర్ వేర్ తో పాటు తన అందాల విరుపులను కూడా బాగానే ఎగ్జిబిట్ చేసింది. 


30+ లోకి కాజల్ అగర్వాల్ వచ్చేసి రెండేళ్లకు పైగానే గడిచిపోయింది. అయినా సరే.. తన తరగని హొయలు చందమామ సొంతం అయిపోయాయి. ముదురు అందాలు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు కానీ.. చందమామ అభిమానులు మాత్రం.. మా హీరోయిన్ అందాలు ఎవర్ గ్రీన్ అని తెగ మురిసిపోతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com