ప్రముఖ బాలీవుడ్ నటి నేహాదూపియా తన చిరకాల స్నేహితుడు, నటుడు అంగద్ బేడీని వివాహమాడింది. నేహా-అంగద్ బేడీల వివాహం దక్షిణ ఢిల్లీలోని గురుద్వారా టెంపుల్లో సిక్కు సంప్రదాయ పద్దతిలో జరిగింది. నేహా పింక్ లెహెంగా, జ్యువెల్లరీ వేసుకోగా..అంగద్ ఐవరీ షేర్వానీతో మెరిశాడు. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ కొత్త జంట తమ పెళ్లి విషయాన్ని సోషల్మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. పెళ్లి ఫొటోను షేర్ చేసిన నేహా ‘నా జీవితంలో గొప్ప నిర్ణయం. నా బెస్ట్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకున్నా. ఇపుడు అతడు నా భర్త’ అని క్యాప్షన్ పెట్టగా, ‘ఇప్పటివరకు బెస్ట్ ఫ్రెండ్..ఇపుడు నా భార్య.. హలో మిసెస్ బేడి’ అని క్యాప్షన్ పెట్టాడు. వివాహవేడుకకు క్రికెటర్లు అజయ్ జడేజా, ఆశిష్ నెహ్రాతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి కుమారుడైన అంగద్ బేడీ, నేహా కొన్నాళ్లుగా డేటింగ్లో ఉన్నారు. అంగద్ బేడీ పింక్, డియర్ జిందగీ, టైగర్ జిందా హై సినిమాల్లో నటించాడు.