ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ర‌జ‌నీకాంత్ అభిమానిగా జ్యోతిక

cinema |  Suryaa Desk  | Published : Fri, May 11, 2018, 10:43 AM



న‌టి జ్యోతిక సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆమె తన వయసుకి తగిన పాత్రలను చేస్తూ సక్సెస్ లు అందుకుంటోంది. కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతోన్న జ్యోతిక, తమిళంలో ఒక రీమేక్ మూవీలో నటించడానికి సిద్ధమవుతోంది. ఇటీవల మలయాళంలో ‘మోహన్ లాల్’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ‘మోహన్ లాల్’ అభిమాని పాత్రలో మంజు వారియర్ నటించి మెప్పించింది. ఈ సినిమా కథ .. ఆ పాత్ర నచ్చడంతో రీమేక్ లో చేయడానికి జ్యోతిక ఆసక్తిని చూపింది. ఈ సినిమాలో ఆమె రజనీకాంత్ అభిమానిగా కనిపిస్తుందట. హాస్యంతో కూడిన సందేశాత్మక చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com