ఆమె వివాహ వేడుకలో ఓపెన్ అయ్యాడు నటుడు వరుణ్‌ధావన్. తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ నటాషా దలాల్‌తో వరుణ్ ఎప్పటినుంచో లవ్‌లో ఉన్నాడని బాలీవుడ్ సమాచారం. అంతేకాదు వరుణ్, నటాషా కెమెరా కంట పడకుండా అప్పుడప్పుడు రెస్టారెంట్స్, థియేటర్స్‌కు సీక్రెట్‌గా వెళుతున్నారని కూడా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు సీక్రెట్ మీటింగ్స్‌కి ఫుల్స్టాప్ పెట్టిందీ ఈ జంట. సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా రిసెప్షన్ వేడుకకు వీరిద్దరూ జోడీగా హాజరయ్యారు. దీంతో ఇక నో సీక్రెట్స్ అని చెప్పకనే చెప్పారు వరుణ్ అండ్ నటాషా. ఇలా జంటగా నలుగురికీ కనిపించడంతో వరుణ్, నటాషా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబో తున్నారన్న కొత్త రాగం బాలీవుడ్లో మొద లైంది. రీసెంట్గా తాను హీరోగా నటించిన ‘అక్టోబర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఏడాదిలో వివాహం చేసుకుంటానేమోనని వరుణ్ చెప్పడం విశేషం.