చైనీస్ సూపర్‌స్టార్ జాకీచాన్ లీడ్ రోల్లో వచ్చిన కుంగ్ ఫూ యోగా మూవీలో సిల్వర్‌స్రీన్‌పై మెరిసింది నటి అమైరా దస్తూర్. ఆ తర్వాత మనసుకు నచ్చింది మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ హీరోయిన్ తాజాగా క్రేజీ ప్రాజెక్టులో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ దేవాకట్టా ప్రస్థానం హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సాయికుమార్ పాత్రని బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ పోషించనున్నాడు. శర్వానంద్ పాత్ర కోసం నటుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు డైరెక్టర్. ఇక రీమేక్‌లో అమైరా దస్తూర్‌ను ఫైనల్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. అమైరా నటించిన రాజుగాడు చిత్రం జూన్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది.