ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ కి వ‌స్తా..

cinema |  Suryaa Desk  | Published : Sat, May 12, 2018, 10:26 AM



ఇటీవలే రంగస్థలంతో తన కెరీర్‌లో అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు రామ్‌ చరణ్‌. చిట్టిబాబు పాత్రలో ఉత్తమ నటన కనబరిచారు. రంగస్థలం విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసం చరణ్‌లో తొణికిసలాడుతోంది. దీంతో మరిన్ని మంచి చిత్రాలు ఎంచుకోవాలనే తపన చూపిస్తున్నారు. ఇందులో భాగంగా మంచి కథలు దొరికితే తమిళ, హిందీలో కూడా నటిస్తాననంటున్నారు. అయితే ప్రస్తుతానికి తెలుగు చిత్రాలతో తీరిక లేకే ఇతర భాషల్లో నటించడం లేదని చెప్పారు. కొందరు తమిళ దర్శకులతో చర్చలు జరుపుతున్ననని అన్నారు. ఇటీవల చరణ్‌ మాట్లాడుతూ….తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించాలని ఉంది. మంచి కథ దొరికితే అభ్యంతరం ఏమీ లేదు. హిందీలో జంజీర్‌ చిత్రం తర్వాత నటించలేదు. బాలీవుడ్‌ సినిమా చేయకూడదు అని నిర్ణయించుకోలేదు. తమిళ దర్శకులతో చర్చిస్తున్నాను. అలాగే కుదిరితే హిందీలోనూ నటిస్తా. రాజమౌళి గారితో మరోసారి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఆసక్తికరంగా, సవాలుగా ఉంటుందని చెప్పగలను. కథపై దర్శకుడు కసరత్తులు చేస్తున్నారు. అన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్‌ సినిమా చేస్తున్నారు. కైరా అద్వానీ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఈరోజు నుంచి బ్యాంకాక్ లో షెడ్యూల్ ప్రారంభం కానుంది..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com