ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క‌ష్టానికి త‌గ్గ ఫలిత‌మే ఇది

cinema |  Suryaa Desk  | Published : Sat, May 12, 2018, 10:31 AM



ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ సుందరి నందితా శ్వేతా. ఆ సినిమా సాధించిన విజయం ఆమెకు కోలీవుడ్‌లో ఫలితాన్ని ఇచ్చింది. తమిళంలో నందిత ఐదు చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో నితిన్‌ హీరోగా నటిస్తున్న శ్రీనివాస కళ్యాణంలో ఒక నాయికగా కనిపించబోతోంది. నటిగా తాను చేసిన పనే అవకాశాలు తీసుకొస్తోందని అంటోంది నందితా శ్వేతా. మనసుకు నచ్చిన, ప్రేమించిన కథలనే ఎంచుకుంటానని చెబుతోంది. తమిళంలో చేస్తున్న సినిమాల్లో సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటిస్తున్న నెంజమ్‌ మరప్పతిలై సినిమా తనకు ప్రత్యేకమని నందితా చెబుతోంది. వ్యక్తిగతంగా తనను ఆ పాత్ర మార్చేసిందంటోంది. నందితా మాట్లాడుతూ….కొన్ని పాత్రలు మనపై చాలా ప్రభావం చూపిస్తాయి. దర్శకుడిగా సెల్వరాఘవన్‌ మహిళల మనసును బాగా అర్థం చేసుకుంటారు. ఆయన కొత్త చిత్రంలో నేను చేస్తున్న పాత్ర చాలా బోల్డ్‌ గా ఉంటుంది. ఈ పాత్ర చేశాక…వ్యక్తిగతంగా నేను మారాను. ఇలా ఉండొచ్చా అనే సందేహాలు నివృత్తి అయ్యాయి. ఇవాళ నాకు వస్తున్న అవకాశాలన్నీ గతంలో నేను చేసిన పనిని గుర్తించి ఇస్తున్నవే. కథను ఎంచుకునే ముందు అది నా మనసును ఎంతగా హత్తుకుంది అనేదే ఆలోచిస్తా. తెలుగులో శ్రీనివాస కళ్యాణం చిత్రంతో నటిస్తున్నాను. దీంతో పాటు మరికొన్ని చిత్రాలు సంప్రదింపుల దశలో ఉన్నాయి. అని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com