ఫ్రెంచ్ రివేరా తీరంలో 71వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుక అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు సినీతారలు ఈ వేడుకకు హాజరై ఎర్ర తివాచీపై హొయలు పోతున్నారు. మన బాలీవుడ్ క్వీన్స్ దీపికా పదుకొణె, కంగనా రనౌత్, మల్లికా షెరావత్ కూడా రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు. కేన్స్ రెండో రోజు పొడవాటి తెలుపు రంగు గౌనులో అందాల రాణిలా కన్పించిన దీపిక పదుకొణె.. మూడో రోజు గులాబీ ముద్దుగుమ్మగా మెరిశారు.
దీపిక శుక్రవారం గులాబీ రంగులో గౌనులో ఎర్రతివాచీపై హొయలొలికించారు. దీంతో పాటు ఆమె చెవులకు ధరించిన వజ్రాల కమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కేన్స్‌లో తళుక్కుమనడం దీపికాకు ఇది రెండోసారి.ఇక ఈ వేడుకకు హాజరయ్యేందుకు మరో అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఇప్పటికే తన కుమార్తెతో కలిసి కేన్స్‌కు చేరుకున్నారు. మే 12, 13వ తేదీల్లో ఐష్ ఎర్రతివాచీపై మెరవనున్నారు. కేన్స్‌లో ఐష్ సందడి చేయడం ఇది 17వ సారి. ఇక ఇటీవల వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సోనమ్ కపూర్ కూడా మే 14, 15వ తేదీల్లో రెడ్‌కార్పెట్‌పై నడవనున్నారు.
Deepika Padukone knows how to impress. Iconic. #Cannes2018 pic.twitter.com/VCrQkxxejP
— • (@faveslooks) May 12, 2018