ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అప్పీల్ తో అదరగొట్టేస్తుంది

cinema |  Suryaa Desk  | Published : Sat, May 12, 2018, 12:42 PM



సినిమా షూటింగుల నుంచి కాస్తంత గ్యాప్ తీసుకుని.. అలా వెకేషన్ గా ఫారిన్ ట్రిప్పులకు వెళ్లడం.. మోడ్రన్ డ్రస్సుల్లో మతి పోగొట్టే ఫోజులతో అభిమానుల గుండెలు కొల్లగొట్టడం హీరోయిన్లకు అలవాటే. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాపులరయిన మిడిలేజ్ లేడీ హీరోయిన్లకు పోటీగా గ్లామర్ అప్పియరెన్స్ ఇవ్వడం అన్నది టాలీవుడ్ వరకు కాస్త అరుదైన విషయమే. 


యాంకర్ నుంచి యాక్టర్ గా మారిన సురేఖవాణి సినిమాల్లో చాలావరకు ట్రెడిషనల్ పాత్రలే చేసింది. ఆమె చేసినవాటిలో అత్యధికం సాఫ్ట్ రోల్సే. కానీ తెరపై కనిపించినట్టు నిజ జీవితంలో ఏమీ ఉండరు కదా. బేసిగ్గా సురేఖవాణి చాలా మోడ్రన్. ఆమె పర్సనల్ టూర్ కు వెళ్లినప్పుడు షేర్ చేసే ఫొటోలు చూస్తే ఆమె ఎంత మోడ్రన్ లేడీయో అర్ధమైపోతుంది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అప్పీల్ తో అదరగొట్టేస్తుంది. రీసెంట్ గా ఓ ట్రిప్ లో షార్ట్స్ అండ్ వైట్ షర్ట్ లో ఆమె స్టిల్స్ గ్లామర్ ప్రియుల మతులు పోగొట్టేశాయి. 


సురేఖరాణి అలాగని యంగ్ ఏమీ కాదు. ఆమెకు టీనేజ్ కూతురు ఉంది. న్యూ జనరేషన్ మామ్స్ అసలైన రిప్రంజటేషన్ అంటే సురేఖ వాణి అనే చెప్పేయొచ్చు. అయినా ఈమె గ్లామర్ ఇంకా టాలీవుడ్ దర్శక - నిర్మాతల దృష్టిలో పడినట్టు లేదు. చూసుంటే మాంచి గ్లామర్ ఉన్న రోల్ గ్యారంటీగా ఆమెకు ఆఫర్ చేసే తీరతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com